సంక్రాంతి బరిలో మెగా వారసుడు రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా మొదటిగా విడుదలైంది దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో శంకర్ దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రం పై మొదటి నుంచి అంచనాలు తక్కువగానే ఉన్నాయి. అయినప్పటికీ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాపై అంచనాలు పెంచే ప్రయత్నం చేశారు అయినప్పటికీ ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే మిశ్రమ స్పందన రావడం మెగా అభిమానులకు కాస్త నిరాశపరిచింది. మరో హీరో నందమూరి బాలకృష్ణ బాబి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మించిన డాకు మహారాజ్ చిత్రం మంచి టాక్ తో ప్రదర్శింపబడుతుంది అయినప్పటికీ ఈ సినిమా స్టోరీ భగవత్ కేసరి మూవిలానేకథ, కథనం సాగుతూ ఉంటుంది. ఫలితంగా సినిమా చూస్తున్నంతసేపుపాత సినిమా చూస్తున్నట్టే ప్రేక్షకులు భావిస్తారుసెకండాఫ్లో కథ నెమ్మదిగా సాగడం కాస్త ఇబ్బందిగా ఉంటుంది ఈ సినిమాలో బాలకృష్ణ నటన అద్భుతంగా ఉంటుంది భగవదత్ కేసరి సినిమాతో పోల్చుకుంటే ఈ సినిమా యావరేజ్ గా ఉంటుందనే భావించాలి.మరో చిత్రం ఫ్యామిలీ హీరోగా పేరొందిన విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా విడుదలై మంచి స్పందన వచ్చింది.అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఎంటర్టైన్మెంట్ కదా కథనంతో సినిమా నవ్వులు పండిస్తుంది ఫ్యామిలీతో చూడదగ్గ చిత్రం అనిల్ రావిపూడి గత చిత్రాలైన ఎఫ్2 ఎఫ్3 చిత్రాల కంటే ఈ ఈచిత్రంలో కాస్త ఫన్ తక్కువనే చెప్పాలి. సంక్రాంతి సందర్భంగా విడుదలైన మూడు చిత్రాలు ఎబో యావరేజ్ గా నిలిచాయి అనడంలో సందేహం లేదు.
Please follow and like us: