గాలివీడు MPDO కార్యాలయ పరిశీలన అనంతరం మీడియాతో ఉప ముఖ్యమంత్రి
గాలివీడు MPDO శ్రీ అల్ఫ్రేడ్ జవహర్ బాబు గారిపై దాడికి పాల్పడిన ప్రతీ ఒక్కరినీ శిక్షిస్తాం
గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలు నలిగిపోయారు, మళ్ళీ అలాంటి పరిస్థితులు తెచ్చే ప్రయత్నం చెయ్యకండి, మా సంయమనాన్ని పరీక్షించకండి
ఒకవైపు రాయలసీమ యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలు వలసలు పోతుంటే, ఇక్కడి నాయకులు దాడుల సంస్కృతి కొనసాగిస్తున్నారు.
నా సహనం పరీక్షించకండి, కడపలో రౌడీ రాజకీయాలు ఆపకపోతే ఇక్కడే క్యాంప్ ఆఫీస్ పెట్టుకుని కూర్చుంటా, మీ అందరినీ సెట్ చేసే పరిస్థితి తీసుకురాకండి.
రాయలసీమ ఏ ఒక్కరి కోట కాదు, జాగీరు కాదు, ప్రభుత్వ కార్యాలయాల్లో చొరపడి దాడులు చేస్తే సహించేది లేదు.
Please follow and like us: