సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎండి డాక్టర్ మనజీర్ జిలాని శామూన్ గురువారం జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. ఆయన ముందుగా గుర్ల మండలం తెట్టంగి రైతు సేవ కేంద్రాన్ని సందర్శించారు. ధాన్యం కొనుగోలుపై ఆరా తీశారు. కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సిబ్బందికి పలు ఆదేశాలు జరీ చేశారు.
మండలంలోని పల్లె గండ్రేడు భారత్ ఆగ్రో ఫుడ్స్ ను ఎండి సందర్శించారు.
ఈ పర్యటనలో జాయింట్ కలెక్టర్ ఎస్ సేతు మాధవన్, వ్యవసాయ శాఖ జెడి వి తారక రామారావు, డి.ఎస్.ఓ మధుసూదన రావు, సివిల్ సప్లై డిఎం మీనా కుమారి, తాసిల్దార్ ఆదిలక్ష్మి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Please follow and like us: