విజయనగరం, జనవరి 12:
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సొంతంగా సమకూర్చుకున్న నాలుగు ఎక్స్ప్రెస్ బస్సులను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం స్థానిక ఆర్.టి.సి. డిపోలో జరిగిన కార్యక్రమంలో ప్రారంభించారు.
విజయనగరం -పార్వతిపురం రూట్ లో రెండు, విజయనగరం- శ్రీకాకుళం రూట్లో రెండు బస్సులను
రాష్ట్ర ఎంఎస్ఎమ్ఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం ప్రారంభించారు .ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ ఆరు నెలల్లో 14 బస్సులు ప్రారంభించామని తెలియజేశారు. ఆర్టీసీకి బస్సులు కొరత చాలా ఉందని అన్నారు. కొత్త బస్సులు పెంచే విధంగా, పాత బస్సులను రీప్లేస్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. చీపురుపల్లి రైల్వే బ్రిడ్జి వలన ఆ రూట్ లో కొంత ఇబ్బంది ఉందని అది తొందరగా పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తానని చెప్పారు.
ఈ సందర్భంగా ఎంప్లాయిస్ అసోసియేషన్, ఎన్ఎంయూ ,ఎస్ డబ్ల్యూ ఎఫ్, మొదలగు యూనియన్లు మంత్రి గారిని సన్మానించారు.
ఆర్టీసీ డిపో ఆవరణలో మొక్కలు నాటారు
ఈ కార్యక్రమంలో విజయనగరం జోనల్ చైర్మన్ దొన్ను దొర, విజయనగరం డి పి టి ఓ సి హెచ్. అప్పలనారాయణ, సి.ఎం.ఈ కే.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు