విజయనగరం, డిసెంబర్ 26: రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎన్.చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు షెడ్యూల్డు కులాల సర్వే నివేదికను జిల్లా వ్యాప్తంగా ఉన్న 530 గ్రామ సచివాలయాలు, పట్టణ ప్రాంతాల్లోని 96 వార్డు సచివాలయాల్లో తేదీ 26-12-24 గురువారం నాడు ప్రదర్శించి దీనిపై ఏమైనా అభ్యంతరాలు వున్నట్లయితే తెలుప వలసిందిగా కోరడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ తెలిపారు. డిసెంబర్ 31వ తేదీ వరకు ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి జనవరి 6వ తేదీ లోగా వాటిని ఆన్ లైన్ లో నమోదు చేయడం జరుగుతుందన్నారు. షెడ్యూల్డు కులాల సర్వే తుది నివేదికను ప్రభుత్వ ఆదేశాల మేరకు జనవరి 10వ తేదీన ప్రచురించే టందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఆయా గ్రామ వార్డు సచివాలయాల్లో ఎస్.సి. కులాల సర్వే నివేదిక లు అందుబాటులో ఉన్నాయని, వాటిని పరిశీలించి తమ అభ్యంతరాలు తెలియజేయ వచ్చాన్నారు.
Please follow and like us: