25-12-2024/రాజమండ్రి
రాజమండ్రి సిటీలో బుధవారం నాడు భారతీయ జనతా పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వైఎస్సార్ పార్టీకి రాజీనామా చేసిన విశాఖ డైరీ మాజీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ కుటంబ సమేతంగా పురంధేశ్వరి సమక్షంలో భాజపా తీర్దం పుచ్చుకున్నారు.ఈ సందర్భంగా యన్.టి.ఆర్.తో ఆడారి తులసీరామ్ గారి అనుబంధం గుర్తు చేశారు. ఈకార్యక్రమంలో మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు,మాజీ ఎమ్మెల్సీ మాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Please follow and like us: