అమరావతి,23 డిసెంబరు:భోగాపురం అంతర్జాతీయ నిర్మాణ పనులను నిర్ధిష్ట కాలపరిమితికి లోబడి సకాలంలో పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సంబంధిత శాఖలు,ఏజెన్సీలకు సూచించారు.ఈమేరకు సోమవారం రాష్ట్ర సచివాలయం నుండి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించిన మొదటి కోఆర్డినేషన్ కమిటీ సమావేశం సిఎస్ నిర్వహించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన ఈఅంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులను వేగవంతంగా సకాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.విమానాశ్రయ నిర్మాణంతో పాటు అక్కడ వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు,ఏజెన్సీల ద్వారా ఏర్పాటు చేయాల్సిన ఏర్పాట్లను కూడా సిఎస్ సమీక్షించారు.ముఖ్యంగా కస్టమ్స్,బ్యూరో ఇమిగ్రేషన్,సిఐఎస్ఎఫ్ భద్రత,ఆరోగ్య తదితర శాఖల పరంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై చర్చించారు.అదే విధంగా విశాఖపట్నం నగరం నుండి భోగాపురం విమానాశ్రయానికి మెరుగైన కనక్టవిటీ తదితర అంశాలపై కూడా సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.
ఈసమావేశంలో కార్యదర్శి డా.ఎన్.యువరాజ్,ఎపి మారిటైం బోర్డు సిఇఓ ప్రవీణ్ ఆదిత్య పాల్గొన్నారు.అలాగే వర్చువల్ గా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ సంస్థల ప్రతినిధులు,పౌర విమానయాన సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.