సలార్ సినిమా విడుదలై కలెక్షన్ల వర్షం కురిపించింది ప్రభాస్ నటించిన సలార్, కల్కి సినిమాలు బాక్సాఫీసు దగ్గర మంచి వసూళ్ళు రాబట్టి రికార్డు సృష్టించాయి. ప్రస్తుతం ప్రభాస్ మారుతి డైరెక్షన్లో రాజాశాబ్, అనిల్ రావిపూడి మరియు సందీప్ రెడ్డి వంగ మూవీ స్పిరిట్ సినిమాలకు కమిట్ అయ్యాడు రాజా శాబ్ షూటింగ్ సమయంలో కాలికి గాయమై ప్రభాస్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈమధ్య ఒక ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ సన్సేషనల్ కామెంట్స్ చేశారు. సలార్ సినిమా అభిమానుల అంచనాలను అందుకోలేదని ఆయన అభిప్రాయపడ్డారు.ఇంకా ఆయన ఏమన్నారంటే..సలార్ సినిమాలో కెజిఎఫ్ చాయలు కనిపించాయి.ఉగ్రం సినిమా కంటే కధ బాగా ప్రజెంట్ చేయాలని చూశాను. కాని నేను అనుకున్న అంచనాలను సలార్ అందుకో లేదు.అందుకే సలార్ 2 సౌర్యాంగ పర్వం నేను తీసిన సినిమాల్లో ది బెస్ట్ సినిమాగా తీయాలని నా ఆలోచన అది కచ్చితంగా ప్రయత్నం చేస్తానని చెప్పడం జరిగింది.
Please follow and like us: