విజయనగరం జిల్లా జడ్జి బి సాయి కళ్యాణ చక్రవర్తి మరియు విజయనగరం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి టీ.వీ రాజేష్ కుమార్ శృంగవరపుకోట ఉపకారాగారమును నేడు ఆకస్మిత తనిఖీ చేయడం జరిగింది. ఆకస్మిక తనిఖీలో భాగంగా సిబ్బంది నిర్వహించే విధులు ,ఖైదీలకు కల్పిస్తున్న సదుపాయాలు, పరిసరాల పరిశుభ్రత మరియు ఖైదీలకు అందజేయాల్సిన ఉచిత న్యాయ సేవలు అంశాలను గురించి ఆరా తీయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా న్యాయమూర్తి మాట్లాడుతూ న్యాయవాదిని నియమించుకునే ఆర్థిక స్థోమత లేని ఖైదీలకు ప్రభుత్వం తరఫున ఉచితంగా న్యాయవాదిని నియమించడం జరుగుతుందని దీనికి సంబంధించిన వివరాలను సబ్‌జైల్ సూపర్నెంట్ ద్వారా గాని లేదా జైలు సందర్శక న్యాయవాదికి గాని ఒక దరఖాస్తును అందజేయడం ద్వారా ఖైదీలకు ఉచితంగా న్యాయవాదులును నియమించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు.
Please follow and like us: