15-12-2024
లక్కవరపుకోట:- రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సాగునీటి సంఘాల అధ్యక్షులు,ఉపాధ్యక్షులు, టిసి మెంబర్లు రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలని శృంగవరపుకోట శాసనసభ్యురాలు కోళ్ల లలిత కుమారి అన్నారు. ఆదివారం లక్కవరపుకోట పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సాగునీటి సంఘాల అధ్యక్ష ఉపాధ్యక్ష టి సి మెంబర్లకు సన్మాన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.శృంగవరపుకోట నియోజకవర్గంలోని 85 సాగునీటి సంఘాలకు పారదర్శకంగా ఎన్నికల నిర్వహించినట్లు తెలిపారు. నియోజకవర్గంలో 85 నీటి సంఘాలకు ప్రశాంతంగా జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన 75 అధ్యక్ష ఉపాధ్యక్ష మెంబర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని మరో 7 వాయిదా పడ్డాయాని తెలిపారు. సాగునీటి సంఘాల ఏకగ్రీవం పై ఆమె సంతోషం వ్యక్తం చేశారు. సాగునీటి సంఘాల ఎన్నికల్లో అధ్యక్ష, ఉపాధ్యక్ష, టిసి మెంబర్లను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు కృషిచేసిన అధికారులు,తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు అభినందనలు తెలియజేశారు. నియోజకవర్గంలో భారీ వర్షాలకు నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు కృషి చేస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి కోళ్ల బాలాజీ అప్పల రాంప్రసాద్ శృంగవరపుకోట నియోజకవర్గంలోని సాగునీటి సంఘాలు ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించినట్లు తెలిపారు. తెలుగుదేశం పార్టీకి ప్రజాభిమానంతో పాటు బలమైన నాయకులు కార్యకర్తలు ఉండటం వల్ల సాగునీటి సంఘ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి అని తెలిపారు. సాగునీటి సంఘ అధ్యక్ష ఉపాధ్యక్షులు రైతులను సమన్వయం చేసుకొని పనిచేయాలని సూచించారు. నియోజకవర్గంలో ఎక్కడ సాగునీటి కొరత రాకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.