పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా శృంగవరపుకోట వాసవి క్లబ్ సభ్యులు ఆధ్వర్యంలో స్థానిక గాంధీ పార్కు వద్ద పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు కొరకు పొట్టి శ్రీరాములు అమరులయ్యారని ఆయన త్యాగాలను ప్రతి ఒక్క ఆంధ్రుడు స్మరించుకోవాలన్నారు ఆయన ఆశయాలకు అనుగుణంగా అందరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ జిల్లా అధ్యక్షుడు నాగరాజు సీనియర్ సభ్యుడు బొండా వెంకటరమణ మూర్తి యస్.కోట వాసవి క్లబ్ మెగా అధ్యక్షుడు కోదేటి సత్యనారాయణ మూర్తి శ్రీనివాసరావు కొల్లా వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Please follow and like us: