గంట్యాడ, గజపతినగరం, (విజయనగరం) డిసెంబర్ 14 :
పలు రైస్ మిల్లలను జాయింట్ కలెక్టర్ ఎస్ సేతు మాధవన్ శనివారం తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. ధాన్యం తూకం, అన్లోడింగ్ పై ఆరా తీశారు.
జాయింట్ కలెక్టర్ ముందుగా గంట్యాడ మండలంలోని శ్రీనివాస, కనకదుర్గ రైస్ మిల్లులను తనిఖీ చేశారు. తూకం విషయంలో ఆ మిల్లుల పై వచ్చిన ఆరోపణపై ప్రశ్నించారు. అన్లోడింగ్ పై ఆరా తీశారు. నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
మురపాక రైతు సేవా కేంద్రాన్ని సందర్శించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేశారు. రైతులు ఇబ్బంది పడకుండా ధాన్యం సేకరణను వేగవంతంగా చేయాలని ఆదేశించారు.
గజపతినగరం మండలంలో వాసవి రైస్ మిల్లును కూడా జెసి తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. ట్రక్ షీట్లు పెండింగ్ లేకుండా చూడాలని జెసి ఆదేశించారు.
ఈ పర్యటనలో సివిల్ సప్లైస్ జిల్లా మేనేజర్ మీనా కుమారి, ఆయా మండలాల తాసిల్దారులు, డీటీలు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.