శ్రీకాకుళం, డిసెంబర్ 13: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మరియు విజిలెన్స్ డీజీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా వారి ఆదేశాల మేరకు, ప్రాంతీయ నిఘా మరియు అమలు అధికారి శ్రీ బి ప్రసాదరావు గారి ఆద్వర్యంలో శ్రీకాకుళం జిల్లా పాతకుంకామ్ గ్రామం మరియు విజయనగరం జిల్లా కర్లం గ్రామం లో పలు ఎరువుల దుఖాణాలలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సంబందిత దుఖాణాలలో సరుకు వ్యత్యాసాలు, కాలం చెల్లిన పురుగు మందులు అమ్మకం వంటి అవకతవకలు గుర్తించడం తో సంబందిత దుఖాణాలలో రూ . 9,59,098/- విలువ కలిగిన 70.545 మెట్రిక్ టన్నుల ఎరువులను సీజ్ చేసి సంబందిత దుఖాణాదారులపై 6(ఏ) కేసులు నమోదు చేయడం జరిగినది. పై తనిఖీలలో నిబందనలకు విరుద్దంగా అమ్మకాలు జరుగుతున్నటి పురుగు మందులను గుర్తించి కేసులు నమోదు చేయడం జరిగినది . ఈ తనిఖీలలో విజిలెన్స్ అధికారులు మరియు సంబందిత మండల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భగా విజిలెన్స్ ఎస్పీ బి ప్రసాద రావు మాట్లాడుతూ ఎరువుల అక్రమ వ్యాపారం పై నిఘా ఉంచామని, తనిఖీల లో పట్టుబడిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలియపరిచారు.
—————————-