ప్రయాణికుల్లా నటిస్తూ దోపిడీకి పాల్పడే ముఠా అరెస్ట్
ఆటోలో ప్రయాణికుల్లా నటిస్తూ దోపిడీలకు పాల్పడుతున్న 10 మంది ముఠాను తెనాలి త్రీ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు.
మంగళవారం గుంటూరు ఎస్పీ కార్యాలయంలో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ సతీష్ కుమార్ వివరించారు.
రూ. లక్ష విలువ చేసే బంగారం, 50 వేల నగదు, 3 ఆటోలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
ఇదే తరహాలో దోపిడీలకు పాల్పడుతున్న మరో ముఠాను త్వరలో పట్టుకుంటామని అన్నారు.
Please follow and like us: