విజయనగరంజిల్లా విభిన్న ప్రతిభా వంతుల శాఖ ఆధ్వర్యంలో మెంటాడ మండలం ఆగూరు కు చెందిన దివ్యంగ విద్యార్థినీ గొర్లె నిఖితకు ఉచితంగా ల్యాప్ టాప్ అందజేశారు. రూ.40 వేల విలువచెసే ఈ పరికరాన్ని దివ్యంగ విద్యార్థుల విద్యా ప్రోత్సాహంలో భాగంగా జిల్లా సమాచార పౌరసంబంధాల అధికారి డి.రమేష్ చేతుల మీదుగా బుధవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభా వంతుల శాఖ సిబ్బంది ఈశ్వర రావు, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Please follow and like us: