ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ మీడియాతో మాట్లాడుతూ మళ్ళీ నందమూరి బాలకృష్ణతో సినిమా తీయబోతున్నానని ప్రకటించారు. గతంలో చెన్నకేశవరెడ్డి సినిమా తీసి మంచి హిట్ కొట్టామని మళ్లీ బాలయ్య బాబుతో మంచి చిత్రం తీయాలనే ఆకాంక్షతో ఉన్నానని తెలియజేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి సినిమాలు నిర్మించడానికి సిద్ధమవుతున్నామని అందులో ముందుగా మా ఇద్దరి అబ్బాయిలతో నిర్మిస్తామని తదుపరి చిత్రాలన్నింటి వివరాలు త్వరలోనే మీడియాకు తెలియజేస్తానని తెలిపారు.
Please follow and like us: