నెల్లూరుకు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత
ఏపీలో అక్రమంగా తరలిపోతున్న రేషన్ బియ్యం
మైదుకూరు నుంచి నెల్లూరుకు బియ్యం తరలింపు
600 బస్తాల బియ్యాన్ని సీజ్ చేసిన అధికారులు
ఏపీలో పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదార్లు పడుతోంది. కేటుగాళ్లు రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. ఓవైపు కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం స్మగ్లింగ్ అంశం కలకలం రేపుతోంది. మరోవైపు మైదుకూరు నుంచి నెల్లూరుకు అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని రెవెన్యూ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు పట్టుకున్నారు.
బియ్యం తరలిస్తున్న లారీని బద్వేలు వద్ద అదుపులోకి తీసుకున్నారు. లారీలో ఉన్న రూ. 15 లక్షల విలువైన 600 బస్తాల బియ్యాన్ని అధికారులు సీజ్ చేశారు. లారీతో పాటు డ్రైవర్ ఓబులేసును అదుపులోకి తీసుకున్నారు.
Please follow and like us: